చిత్రమైన వార్తలు
"చిక్కీ పిక్కీ" అనే కాలనీలో "గురునాథ్" అనే వ్యక్తి, తోపుడుబండిమీద వస్తువులు పెట్టుకొని, వ్యాపారం చేసుకుంటాడట. మామూలుగానే పాపం నిన్న తన బండితోసుకుపోతూంటే, యెక్కడనుంచి వచ్చిందో, ఓ బుల్లెట్ అతని యెడమ భుజం దండలో దిగబడిందట! హటాత్తుగా రక్తం కారడం, నెప్పీ తెలిసేసరికి అతన్ని ఆసుపత్రిలో చేర్చి, బుల్లెట్ తీయించి చికిత్సచేయించారట. ఆ విషయాన్ని, అతని స్నేహితుడు "రాహుల్ గాంధీ" ఫోనుద్వారా తన భార్య "గులాబ్ జామూన్" కి చెపితే, ఆమె పొరుగునే వున్న గురునాథ్ భార్య "జపాన్" కీ, మామయ్య "అండమాన్" కీ చెప్పిందట. ఇదంతా "దొండకాయంత" దొంగాడు, "పొట్లకాయంత" పోలీసు, "జామకాయంత" జైలు లాంటి కథ కాదండోయ్! బెంగుళూరు నగరంలో నిజంగా జరిగిన ఘటన అని పేపర్లో ఫోటొతోసహా ప్రచురించారు!
మామూలుగా ఆడవాళ్లు ముందుండే ద్వారంలోంచీ, మగవాళ్లు వెనకుండే ద్వారంలోంచీ యెక్కుతారు సిటి బస్సులో. బెంగుళూరులో, ముందు ద్వారంలోంచి యెక్కేసిన ఓ యువ సాఫ్ట్ వేర్ మగ ఇంజనీరుని కండక్టరు కన్నడంలో "నువ్వేమయినా ఆడపిల్లవా? ముందునించి యెక్కేశావు?" అని కోప్పడ్డాడట. దానికతను "గొత్తిల్ల" (నాకు కన్నడం "తెలీదు" అనే వుద్దేశ్యంతో) అని సమాధానం ఇచ్చేసరికి బస్సంతా గొల్లున నవ్వులు! (ఇది పాత జోకే అయినా, బెంగుళూరు ప్రసక్తి వచ్చింది కాబట్టి సరదాగ మరోసారి!)
అమెరికాలోని ఓహియో నగరంలో 911 (పోలీసు) కి ఓ ఫోను వచ్చిందట. విషయం "బనానా పీల్" (అరటిపండు తొక్క) ఒకటి "గొరిల్లా" ని గుద్దేసి వెళ్లిపోతే, గొరిల్లా క్రిందపడిపోయి నడుమో యేదో బెణికిందట! పోలీసులు ఆరా తీస్తే, విషయం--తన వుద్యోగంలో భాగంగా ఒకాయన, ఓ స్టోరు దగ్గర గొరిల్లా వేషంలో, వచ్చేవాళ్లని అలరిస్తూ వుంటాడట. ఓ నలుగురు టీనేజర్లు తమ విచిత్ర వేషధారణలో భాగంగా రకరకాల దుస్తులు ధరించి పరిగెట్టుకు వెళుతూ, ఆయన్ని ఓ సగం వొలిచిన అరటిపండు వేషంలో వున్న ఒక టీనేజరు గుద్దేశాడట! పోలీసులు దర్యాప్తు చేసినా, ఆ అరటి తొక్క దొరకలేదట గానీ, అదో పెద్ద వార్త అయిపోయింది! అదీ సంగతి.

No comments:
Post a Comment