.......సందేశాలూ
ఆ విధంగా ఒకానొక దివసంబున నా కవుంటర్లో పనిలో వుండగా, రద్దీ తక్కువగా వున్న సమయంలో మేనేజరు గది నుంచి పిలుపు. లోపలికి వెళ్లేసరికి ఓ కస్టమరు ని పరిచయం చేసి, నా వివరాలు చెప్పమన్నాడు మా మేనేజరు.
బయటికి వచ్చేసరికి, మా కొలీగ్ ఫ్రెండ్స్ "పెళ్లి సంబంధమే" అని గొడవ. నిజంగానే ఓ పెద్దింటి సంబంధం చెప్పాడాయన. జరగలేదనుకోండి.
ఆలా మొదలైన పెళ్లి సంబంధాల పరంపరలో, ఓ సారి మా వూరు వెళ్లినప్పుడు, ఇంకో సంబంధం గురించి చెప్పారు.
మా వీధి పోస్ట్ మేన్, కాకినాడలో మా (అప్పటికింకా కాని) తోడల్లుడిగారి వీధి పోస్ట్ మేన్ చుట్టాలట. ఆ పోస్ట్ మేన్ నా వుద్యోగం, వివరాలూ మా పోస్ట్ మేన్ ద్వారా తెలుసుకొని, ఆయనకి చెపితే, వెంటనే మా కాబోయే మామగారిని మా ఇంటికి పంపించాడు. మిగతావన్నీ యథావిథిగా జరిగి, ఇదిగో, మా కాపురం ఇన్నేళ్లుగా జరుగుతోంది!
అందుకనే, "ఆ పోస్ట్ మేన్ ని తన్నాలి" అని అప్పుడప్పుడూ తిట్టుకోవడం.
అదీ "నేనూ నా రాక్షసి" కథ.
No comments:
Post a Comment