Monday, August 29, 2011

పరిత్రాణాయసాధూనాం.....



సారధ్యం.....మంత్రాంగం

ఇదివరకటి ఫ్ర రా పా లో శల్యుడెవరో, శకుని యెవరో నాకు తెలీదు గానీ, భలే రాజకీయం నడిపిస్తున్నారు. 

వై ఎస్ ఆర్ దగ్గర మంత్రులుగా పనిచేసినవాళ్లు అందరూ ఆయన బొమ్మమీదే గెలిచారు అన్నది అతిశయోక్తికాదు. 

అలాంటివాళ్లందరూ ఇప్పుడు, సహజంగా,  అందుకు కృతఙ్ఞతగా "వైయెస్సార్ కాంగ్రెస్" లో చేరాలి కదా?

లేదూ, మేము సోనియా బొమ్మే పెట్టుకొని గెలిచాం, అందుకే జగన్ తో చేరడంలేదు అనైనా చెప్పాలికదా?

సరే. నిజంగా వైఎస్సార్ బొమ్మతో గెలిచి, ఇప్పుడు కాదు పొమ్మంటున్నవాళ్లు--ఇంకా మంత్రులుగా, నాయకులుగా కొనసాగుతున్నవాళ్లు యెవరికి కృతఙ్ఞులుగా వుండాలి?

సహజంగా, నిస్సందేహంగా, మన చిరంజీవికే కదా?

ఆయన ఫోటోలూ, బ్యాడ్జీలూ లేకుండా మీరు జిల్లాల్లో పర్యటనలు కొనసాగిస్తారా? హౌ డేర్ యూ? 

మీరు ఆయన ఫోటోలు పెట్టుకున్నాసరే, లేదా జగన్ తో చేరినా సరే, లేదా రాజీనామాలుచేసి మళ్లీ యెన్నికల్లో నిలబడినా సరే!

అంతేగానీ, వెధవ్వేషాలెయ్యకండి! అని హెచ్చరిస్తున్నారు ప్ర రా పా "ఆన్నా" లు!

బాగుంది కదూ?

2 comments:

Anonymous said...

> ఆయన ఫోటోలూ, బ్యాడ్జీలూ లేకుండా మీరు జిల్లాల్లో పర్యటనలు కొనసాగిస్తారా

ఆయన అంటే? చిరంజీవా? జగనా? అన్నాహజారేనా? మన్మోహనా? కికురేనా?

A K Sastry said...

పై అన్నోన్!

ప్ర రా పా వాళ్లు ఇంకెవరి ఫోటో పెట్టుకోమంటారు?

చిరంజీవిదే!

అదే రాజకీయం.