......"అదుర్స్" కార్డులు!
బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ వాళ్లు, వ్రేలి ముద్రలూ, చేతి ముద్రలూ, ఐరిస్ లూ లాగే "చెవులని" కూడా బయోమెట్రిక్ పధ్ధతిలో స్కాన్ చేసి, ఆయా వ్యక్తుల వివరాలని గుర్తించే విధానాన్ని రూపొందించారట! కేవలం 252 మంది చెవులని మాత్రమే పరిశీలించి, ఈ పధ్ధతి విజయవంతం అవుతుందని తేల్చేశారట!
మరింకేం! మనం కూడా ఈ "చెవోమెట్రిక్" విధానం లో కార్డులు జారీ చేసేద్దాం!
కానీ ఇప్పటికే, రైతులకీ, చిన్న వ్యాపారులకీ, పేదలకీ, వుపాధి వాళ్లకీ, వోటర్లకీ, విద్యార్థులకీ, గిరిజనులకీ రక రకాల చెత్తా చెదార కార్డులిచ్చేశామే?! మరి కొత్త కార్డులెవరికి ఇవ్వాలి?
"అదుర్స్" కార్డుల పేరుతో మన రా నా లకి ఇచ్చేస్తే పోలా? సురక్షితం గా "మన పని" కానిచ్చుకోవచ్చు, పైగా వాళ్లు వాళ్ల జీత భత్యాలనీ, ప్రభుత్వం నించి రావలసిన బిల్లులనీ, అలవెన్సులనీ వగైరా ఈ కార్డు తో డ్రా చేసుకొని, ఆదాయ పన్ను రిటర్న్ లని యేమాత్రం శ్రమ పడకుండా సమర్పించడానికి అనుకూలంగా వుంటుంది! (ఇవన్నీ వైటే కదా--పైగా ఆడిటర్లకి ఇచ్చే ఫీజు కలిసొస్తుంది!)
ప్రభుత్వం వారూ--టెండర్లు యెప్పుడు పిలుస్తారు?
4 comments:
What an idea,sirjee.
డియర్ "......దండలు"!
సంతోషం!
ధన్యవాదాలు.
> రా నా
??
డియర్ పానీపూరి123!
రా నా లనగా 'రా'జకీయ 'నా'యకులు. వీరిలో రాష్ ట్రపతి, గవర్నర్లనుంచీ, వివిధరకాల మంత్రులూ, ఎంపీలూ, ఎమ్మెల్యేల దగ్గర నుంచీ, గల్లీ నాయకుల దాకా వుంటారు!
రా రా లంటే 'రా'జకీయ 'రా'క్షసులు. అంటే, పైవాళ్లలో తమ తమ దందాలు చేసుకొంటూ, అడ్డొచ్చినవాణ్ని లేపెయ్యడానికి కూడా వెనకాడని వాళ్లు. వుదా: సోంపేట.
ఇంకా వివరాలకి చూ: నా పాత టపాలు.
Post a Comment