Monday, August 23, 2010

తెలుగు తేజాలు

కలలు కనండి

ఇక్ష్వాకుల దగ్గరనించి, శాతవాహనుల దగ్గరనించి, కృష్ణదేవరాయలు దగ్గరనించి, టంగుటూరీ, పీవీ, లేటేస్ట్ శ్రీరామ్ వరకూ యెందరో తెలుగు తేజాలు!

పాతవాళ్లకి మన కలామ్ లాంటివాళ్లెవరైనా "కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి!" అని చెప్పారో లేదో తెలియదు గానీ, శ్రీరామ్ లాంటి వాళ్లకి మాత్రం ఆయన చెప్పింది శిరోధార్యం.

అదేమిటోగానీ, మన తెలుగు వాళ్లకి వచ్చే కలలు కూడా అంత గొప్పగా వుండవేమో అనిపిస్తూంది.

దేవుడికోసం తపస్సు చేసి, ప్రత్యక్షమవగానే, "మా మేనమామ చెవుల్లో వెంట్రుకలు మొలిపించు" అని కోరుకున్నవాడు మన తెలుగువాడే!

డబ్బు సంపాదించడమే కాదు దాన్ని "సద్వినియోగం" చెయ్యడం కూడా తెలియాలంటారు.

అందాలరాముడు సినిమాలో ముళ్లపూడివారనిపించినట్టు--"ఓ వందరూపాయలనోటుని అలా గాలిలో యెగరేసి, పెసరట్టు తెమ్మంటే తేదూ?" (ఈ డైలాగు ఇలాగే వుండకపోవచ్చు)

చెప్పొచ్చేదేమిటంటే, మన ప్రస్తుత తెలుగు తేజం కేవీపీ రామచంద్రరావు చాణక్యుడి వంటివాడయితే, జగన్ చంద్రగుప్తుడివంటివాడు కాదూ? (గాలి ని పర్వతకుడనుకోవచ్చు)

ఆ లెవెల్లో, ప్రథాన మంత్రి సీటుకి ప్రయత్నించకుండా, బోడి ముఖ్యమంత్రి యేమిటండీ?

యాత్రలవల్ల వోట్లు రాలితే, చిరంజీవి ఇప్పటికే ముఖ్యమంత్రి అయ్యేవాడుగా?

కుంచం మామూలుగా కొలవడం కుదరకపోతే, తిరగేసి కొలవమన్నారు!

తగిన వ్యూహం తో ముందుకెళితే ప్రథానమంత్రి పదవి ఓ లెఖ్ఖలోది కాదు--మన పీవీ, సోనియా చూపిన మార్గాలెలాగూ వున్నాయి! 

అప్పుడు అన్ని రాష్ట్రాలవాళ్లూ ముఖ్యమంత్రి పదవులకోసం మన కాళ్ల ముందరే పడి వుంటారు కదా?

చిన్న సమస్య యేమిటంటే, ప్రత్యర్థి రాహుల్ ని యెదిరించాలంటే, అంతర్జాతీయ ఇటాలియన్ కనెక్షన్ తో పెట్టుకోవాలి.

మనకి రస్ అల్ ఖైమాలూ, మారిషస్ కనెక్షన్లూ వున్నాయి కదా! అదెంతపని.

జగన్! ఆలోచించు! 2014 కల్లా జగన్ ని ప్రథాన మంత్రిని చెయ్యాలి అనే ఆశయంతో ముందుకు సాగడమే మా వంతు అని తమ అనుచరులుతో అనిపిస్తే యెలావుంటుందో!

శుభస్య శీఘ్రం!

8 comments:

Krishnarjun said...

కాంగ్రెస్ లో నాకు ప్రధాని / అధ్యక్ష పదవి రాకపోయినా పరవాలేదు కానీ పక్క వాడికి మాత్రం రాకూడదు అనే వారు ఉండటం వల్లనే నెహ్రూ కుటుంబం / మన్మోహన్ పదవుల్లో కొనసాగుతున్నారు.

ఒకవేళ జగన్ రాహుల్ కి పోటీ అయిన పక్షంలో తప్పకుండా మన్మోహన్ లాంటి తటస్థులు పదవిలోకి వచ్చే అవకాశం ఉంది.

A K Sastry said...

డియర్ Krishnarjun!

మీ రాజకీయ విశ్లేషణ బాగానే వుంది.

మరి "ఆర్థిక" (కొనుగోళ్లు) మాటేమిటి?

జగన్ తెగిస్తే, ఈ రాజకీయ సిధ్ధాంతాలన్నీ యేమవుతాయో వ్రాయరేం?

ధన్యవాదాలు.

Krishnarjun said...

జగన్ తెగించడు. ఇదంతా అధిష్టానంతో జరుగుతున్న Negotiations లో భాగం. కొనుగోళ్ళతోనే సాధించగలిగేటట్లయితే ఎప్పుడో తెగించివుండి వుండేవాడు.

వై.ఎస్.ఆర్ అధిష్టానాన్ని తన వోట్ బాంక్ తో కట్టిపడేయగలిగాడు. ఇప్పుడు జగన్ కి ఆ వోట్ బాంక్ ని మళ్ళించడం, వోట్ బాంక్ చూపి అధిష్టానం తో CM post Negotiation ఈ యాత్ర ముఖ్యోద్దేశం. రాజకీయల్లో డబ్బు ఒక్కటే కాదు, వోట్ బాంక్ అంతే ముఖ్యం. ఆ వోట్ బాంక్ కోసమే రాహుల్ కూడా కష్ట పడుతున్నది.

A K Sastry said...

"..........తెగించడు" అనే అందరూ అనుకుంటున్నది నిజమే!

అందుకే, తెగిస్తే? అనే హైపోథెటికల్ ప్రశ్న.

ఓ సారి పీ ఎం అయితే, వోటుబ్యాంకులూ అవీ పరిగెత్తుకుంటూ వెనకాలే రావూ?

ఆలోచించండి.

Krishnarjun said...

రాష్ట్రంలోని అందరు వోటర్లనూ ప్రభావితం చేయగలిగే నాయకుడు గా ఇంకా జగన్ ఎదగలేదనేదనేది నా అభిప్రాయం.

ఒకవేళ జగన్ తెగిస్తే జరిగేది చిరంజీవికి లాగా ఆశాభంగం కావొచ్చు.

పి.ఎం అయినంత మాత్రాన దేవెగౌడ, మన్మోహన్, నరసింహా రావ్ మొదలైన వాళ్ళు ఏ వోట్ బాంక్ సాధించగలిగారు ??

A K Sastry said...

డియర్ Krishnarjun!

మీరు ఇంకా అసలు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు లేదు.

నేను దేశాధికారాన్ని హస్తగతం చేసుకొనే అడ్డదారి గురించి వ్రాస్తే, మీరింకా సిన్సియర్ గా వోట్లూ, బ్యాంకులూ, వోటర్లూ, ప్రభావం గురించి మాట్లాడుతున్నారు.

అధికారమంటూ వస్తే, కొద్ది కాలం అయినా, మధుకోడా వాడి బాబులాగ, తన అనుచరులకి కొన్నివేల కోట్లూ, తనకి కొన్ని లక్షల కోట్లూ సంపాదించుకొని, తనకో వారసుణ్ని తయారుచేసుకొంటే చాలదూ?

పైగా, తరవాత దేవెగౌడ లా జీవితాంతం "మాజీ ప్రథాని" అని పిలిపించుకోవచ్చు!

పీవీ తను అధికారం లో కొనసాగడానికి శిబుసోరెన్లూ, సిమన్ మరాండీలూ వాళ్ల మద్దతు సంపాదించలేదూ?

మళ్లీ మన్మోహన్ అదే శిబు సోరెన్లూ, మందా జగన్నాధాలూ, ఆదికేశవులు నాయుడులూ వాళ్ల మద్దతు తో అవిశ్వాస తీర్మానం నెగ్గలేదూ?

వోటు బ్యాంకులెవడికి కావాలి! (ఎండ్స్ జస్టిఫై ది మీన్స్!)

Krishnarjun said...

మీరు జగన్ ని నడిపించాలనుకుంటున్న అడ్డదారి అర్థమయ్యింది.
నే చెప్పుకొస్తున్నది.. అది ఈ దేశంలో అసాధ్యం అని.
అదే సాధ్యమయితే అంబానీలు, టాటా లూ, బిల్గేట్లు ఎప్పుడో అధికారాన్ని చేజిక్కించుకొనేవాళ్ళు. అమెరికా నో పాకిస్తానొ చైనా నో డబ్బుపోసి మన ప్రభుత్వాలని కొనుక్కొనుండేవి. కేంద్రంలో మన్మోహన్, రాష్ట్రం లో రోశయ్యలే దీనికి నిదర్శనం.

A K Sastry said...

హమ్మయ్య! అర్థమయ్యిందికదా?

ఇది 'నేను' జగన్ని నడిపించాలనుకుంటున్న దారి కాదు--జస్ట్ హైపోథెటికల్ అని ఇదివరకే వ్రాశాను.

అంబానీలూ వగైరాలు ఓదార్పు యాత్రలు చెయ్యడం లేదు కదా? (వాళ్లకి అధికారం లో యెవరు వుంటే వాళ్ల కొమ్ముకాయడమే ముఖ్యం--వాళ్లింకా కోట్లు దండుకోడానికి.)

అదుగో.......మళ్లీ మీ ముక్కెక్కడవుంది అంటే తిప్పి తిప్పి చూపిస్తున్నారు.....కేంద్రం లో మన్మోహన్, రాష్ట్రం లో రోశయ్య యెందుకున్నారు? ఇటాలియన్ సోనియా ధర్మం వల్ల. ఆవిడ చెప్పనే చెప్పింది......."ఆయన యెంత సంపాదించుకున్నా, రెండోసారి కూడా ముఖ్యమంత్రిని చేశాం! ఆయన కొడుక్కి అంత అత్యాశ తగదు!" అని.

ఇది ఇటలీ దేశానికి పరోక్షంగా అమ్ముడుపోవడం కాదా?

అప్పుడు జగన్ "అబ్సొల్యూట్ పవర్" కోసం ప్రయత్నిస్తే తప్పేముంటుంది?