.....శిక్షలూ
గాలి ఇంట్లో జప్తులకి సంబంధించి "పంచనామా" మీద సంతకం చెయ్యడానికి కూడా యెవరూ ముందుకు రాలేదుట. మరి ఇలాంటి పంచనామాలు బుధ్ధి వున్న యే న్యాయమూర్తి న్యాయస్థానంలోనూ చెల్లవు--అజిత్ భరిహోకే లాంటి వాళ్లుండే "ఫాస్ట్ ట్రాక్" న్యాయ స్థానాల్లో తప్ప!
ఆయన, "సుంకులమ్మ" ఆలయాన్ని కూలగొట్టినందుకే, బ్రతికి వుండగానే, శిక్షగా "ఛిప్పకూడు" తింటున్నాడు....అమాయక గిరిజనులు శపించారు......అనీ, పాపభయం తోటే ఇంకో ఆలయాన్ని సుంకులమ్మకి కట్టించాడు అనీ, అదే భయంతో, తిరుమలేశుడికీ, కాళహస్తీశ్వరుడికీ కిరీటాలూ వగైరాలు చేయించాడు అనీ, 'జ్యోతిష్యంలో చెపుతాము దేవాలయాన్ని కూలగొట్టినా, భూములూ, ఆస్థులూ కబ్జా చేసినా, పుష్కరాలపాటు శిక్ష వుంటుంది '--అని చెపుతున్న ఫేషన్ గడ్డాల పండితులూ......ఇలా రెచ్చిపోతున్నాయి.....టీవీ ఛానెళ్లు!
"పితా......ఆ.....ఆ....ఆ.....! ఆఁ! ఆఁ! ఆఁ! ఇవన్నీ నిజాలేనంటావా! దేవాలయ భూములని కబ్జా చేసి, అపార్ట్ మెంట్లూ, కాలనీలు కట్టినవాళ్లూ, తరతరాలుగా అనుభవిస్తున్నవాళ్లూ, 'వాళ్లు జీవించి వున్నప్పుడే' శిక్షలు అనుభవిస్తారు.....అంటావా! సరే....సరే.....అదే అందరికీ చెపుతాను......"
2 comments:
అధర్మాలు చేసిన వారు దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. చూసేవారికి మాత్రం వారి జీవితం గొప్పగా కనిపించినా , పైకి కనిపించని విధంగా కూడా చాలా శిక్షలు ఉంటాయండి.
వ్యాధులు, కుటుంబసభ్యులతో బాధలు, మనిషికి అంతర్గతశత్రువులైన కోపం, అసూయ, వంటివి కూడా శిక్షలే. తనకోపమే తన శత్రువు అని పెద్దలు అన్నట్లుగా.
కొందరికి మాట వినని వారి మనసే పెద్ద శత్రువు. ఇలా శిక్షలు ఎన్నో రకాలు. శిక్ష అంటే జైలులో ఉండటం మాత్రమే కాదండి.
పై అన్నోన్!
మీరు "పాయింట్" సరిగ్గా అర్థం చేసుకున్నట్టులేదు!
"పిత" చెప్పినమాట, వాళ్లు "తరతరాలుగా", జీవించి వుండగానే "శిక్షలు" అనుభవిస్తున్నారు.....అని! అంటే, జీవించివుండగా వాళ్లేమీ శిక్షింపబడడం లేదు, అందుకే తరతరాలవాళ్లూ సుఖిస్తున్నారు అనీ, వాళ్లు మిగిలిన (దేవుడిసొమ్ము మ్రింగడం కాకుండా మామూలు అధర్మాలు చేసిన) మానవులందరిలాగానే వ్యాధులూ వగైరాలు అనుభవిస్తున్నారుగానీ, ఫేషన్ గడ్డాల జ్యోతిష్కులూ, వాస్తు, సాముద్రిక పండితులూ చెప్పినట్టు "ప్రత్యేక" శిక్షలేమీ అనుభవించడం లేదు అనీ!
ఇంకా మీకు అర్థం కాకపోతే నేనేమీ చెయ్యలేను!
ధన్యవాదాలు.
Post a Comment