'రక్తం' విరుస్తామంటున్న ఎక్స్ పీఆర్పీలు!
ఓ పాతికేళ్లక్రితం ఎం ఆర్ ప్రసాద్ అని ఓ మిమిక్రీ ఆర్టిస్టు (రాజమండ్రి అనుకుంటా) తరచూ తన మిమిక్రీ తో కొన్ని సన్నివేశాలని సృష్టించి, ఆడియో క్యాసెట్లు రిలీజు చేసేవాడు. (ఇప్పుడేం చేస్తున్నాడో తెలీదు).
అతని క్యాసెట్లలో అందర్నీ ఆకట్టుకొన్నవాటిల్లో ఒకటి "చిరంజీవి-శ్రీదేవిల పెళ్లి". సినీ ఆర్టిస్టుల గళాలని అనుకరిస్తూ కామెడీని ప్రవహింపచేశాడు. కడుపుబ్బ నవ్వకుండా వుండలేము!
ఆ క్యాసెట్లో బోనస్ గా ఓ స్కిట్ అందించాడు--పాత తరం విలన్ నాగభూషణం (మంచిమనసులు) ఓ సినిమా తియ్యదలుచుకుని, హీరో కోసం ప్రకటన ఇస్తే, నాగేశ్వర రావు, రామా రావు, కృష్ణ, శోభన్ బాబు--ఇలా అందరూ తమ కొడుకులని హీరోగా రికమెండు చేస్తూ, "ప్రక్కనుంచీ, వెనుకనుంచీ, ముందునుంచీ, పైనుంచీ" తమ తమ సహకారాలని ఆయనకి వాగ్దానం చేస్తారు!
అందులో అందరూ అనే మాట "నా కొడుకులని ఇష్టం వచ్చినట్టు వాడుకోండి! నన్నుకూడా ఇష్టం వచ్చినట్టు వాడుకోండి!" అని.
ఇప్పుడు--చిరంజీవి పాపం--ఇదే డైలాగు కాంగీ వాళ్లకి అనేకసార్లు చెపుతున్నా--వాళ్లు "వాడుకోవడం లేదు" అని ప్ర రా పా "సామాజిక న్యాయులు" బొచ్చెలాంటివాళ్లమీద ఆగ్రహించడంలో తప్పేమైనా వుందా?
యేమో మరి!