Monday, May 30, 2011

"మంత్రాలూ......



......చింతకాయలూ!"

నేను తఱచూ నా టపాల్లో ప్రస్తావించే మా తెలుగు మేష్టారు (పేరి వారు) వ్యంగ్యంగా, "మంతరాలకి సింతకాయలు రాల్తాయేటి?" అని, మళ్లీ తనే "మర్రాలవేటి?" అని, "వొరే అప్రాచ్యులూ! మంత్రాలకి చింతకాయలేకాదు.....కొబ్బరికాయలూ, బుర్రకాయలూ కూడా రాల్తాయి....జాగ్రత్త!" అని కోపగించేవారు.

అఫ్ కోర్స్....ఆయన మంత్రాలూ, అనుష్టానాలూ, నమ్మకాలూ, దీక్షలూ ఆయనవి.

ఈ మధ్య, "ఓం! .......య విద్మహే! .....య ధీమహి! తన్నో/థన్నో/దన్నో/ధన్నో/తన్నః/ధన్నః ........ప్రచోదయాత్" అనే ఓ మంత్రాన్ని తరచూ వింటున్నాము.

వుదాహరణకి ".....వేంకటేశా......శ్రీనివాసా......విష్ణుః......" పెట్టుకోండి పై డేష్ లలో!

ఇలా, ".....మాతృదేవతా.......తలుపులమ్మా.....పార్వతీ దేవ్యః....." అంటూ, యే దేవీ దేవతలకైనా వాడేస్తున్నారు.

మొన్న సాయిబాబాని సమాధి చేస్తున్నప్పుడు, చుట్టూ కర్టెన్లు క్రిందికి లాగేసి, గంటన్నర పాటు "ఓం సాయి దేవాయ విద్మహే....సత్యదేవాయ ధీమహి, 'తన్నః సర్వః' ప్రచోదయాత్!" అంటూనేవున్నారు సాయిసేవాదళ్ వలంటీర్లు. (సత్య, సాయి పేర్లూ అటూ ఇటూ అయ్యాయేమో సరిదిద్దుకోండి అవసరమైతే!)

మరి ఇదేమి మంత్రం? దీని వ్యుత్పత్తి యెక్కడా? యెవరు మొట్టమొదట ప్రవచించారు? దాని అనుష్టాన విథానాలేమిటి? యే వేదంలో, వుపనిషత్తులో, పురాణంలో వుంది?....లాంటి తన ప్రశ్నలకి సరైన జవాబు ఇచ్చినవాళ్లకి "అర్థ రాజ్యమూ, తన కూతుర్నిచ్చి పెళ్లీ" అనీ, అలా చెప్పలేకపోతే, "శిరచ్చేదం చేసి" కోటగుమ్మానికి వ్రేళ్లాడగడతాననీ ప్రకటించేశాడు మా కొండె.....పెసిగాడు అనబడే ప్రసాద్ గాడు. 

(వాడి రాజ్యం గురించీ, కూతురి గురించే ఇప్పుడే చెప్పేకన్నా, మీ తలకాయలు భద్రంగా చూసుకోండి అని హెచ్చరిస్తూ, వాటి వివరాలు "రేపు చెపుతాను" అని కోటగోడమీద వ్రాస్తున్నా!)

ప్రయత్నించండి మరి!

4 comments:

మాగంటి వంశీ మోహన్ said...
This comment has been removed by the author.
A K Sastry said...

డియర్ డియర్ వంశీ!

చాలా సంతోషం....ఓ మంచి విషయం వ్రాసినందుకు.

అసలు "మంత్రం" మీదేమైనా......?

ధన్యవాదాలు.

మాగంటి వంశీ మోహన్ said...
This comment has been removed by the author.
A K Sastry said...

డియర్ వంశీ!

బ్రతికించారు.....(మా కొండె రాజ్యం--వాళ్ల వూరి రుద్రభూమి అనీ, వాడి కూతురు....పడిపోయిన వాడి కోటగోడ ప్రక్కన వున్న చెట్టుక్రింద పాటలు పాడుతూన్నప్పుడు వాడు....నిమురుతూ వుండే కుక్క అనీ మీకెలా చెప్పాలా అని మథన పడిపోయాను)!

ధన్యవాదాలు!