పరస్పర డబ్బా
"ఆడ వాళ్ళు"--'ఆడ' అంటే మన సినీ రచయితలూ, దర్శకులూ ఇచ్చిన నిర్వచనం--'ఈడ' (పుట్టింట్లో) కాదు, 'ఆడ' (అత్తింట్లో) అని.
కానీ నా అనుమానం, 'ఆడ' అంటే 'వంటిల్లు' అనే అర్థం యెక్కడైనా వుందేమోనని! (యే సూర్యారాయాంథ్ర నిఘంటువులోనో ఈ అర్థం దొరక్కపోదు)
యెందుకంటున్నానంటే, బ్లాగుల్లోకూడా వంటల గోలే!
(ఓ యాభై యేళ్ళ క్రితం మాలతీ చందూర్ వ్రాసిన వంటలూ, పిండి వంటలూ దగ్గర నించీ, భానుమతి వ్రాసిన వంటల నించి, ప్రతీ పత్రికలోనూ, టీవీ ఛానెల్లోనూ వస్తున్న 'రుచి-అభిరుచి', 'మీ ఇంట మా వంట', 'మా వూరి వంట' వరకూ ఇవే వంటలు)
అన్నట్టు 'అవడా మామిడికాయలతో' యేమి వంటలు చెయ్యచ్చో మీకెవరికైనా తెలుసా?
యేనుగుల-వడ చెట్లుంటాయని వాటికి కాయలుంటాయని తెలుసా?
దీనికి తోడు, ఓ పాప్యులర్ దినపత్రిక ఓ రోజు 'బ్లాగుల్లో షడ్రుచులు' అనో, యేదో వ్రాస్తే, ఇక పరస్పర డబ్బాలు.
నాలాంటివాడు యేదో ఓ వ్యాఖ్య వ్రాస్తే, ఓ 'తెల్లారిలేస్తే తరవాత ముద్ద గురించి ఆలోచించేవాడో యెవడో' ఈయనకి ఇక్కడేమి పని? అని ప్రశ్నిస్తాడు!
ఇదేమి చోద్యమో?
'ఆడవాళ్ళూ--వంటింట్లోంచి, పూలూ, మొక్కలూ, మొగుళ్ళ డబ్బాలు కొట్టడాలూ--వీటినించి బయటికి రండి! మీకు పోయేదేమీలేదు--........తప్ప!'
(డేష్ లో యేమిటో మీరే పూరించుకోండి)
==>ఇది కేవలం సరదాకోసం వ్రాసినదే తప్ప, అమ్మల్ని, అమ్మాయిల్నీ నిందించడానికి కాదు. గమనించి, దాడి చెయ్యకండి!
చేసినా మరేం ఫర్వాలేదు--నా సోదరులే నాకు రక్ష.
2 comments:
నాక్కూడా చురక వేశారన్నమాట!:-))!
ఆ ఆర్టికిల్ రాసింది నేనేలండి ఆ పత్రికలో! నిజానికి వంట నా సబ్జెక్టు కాదు. అంతకంటే మంచి సబ్జెక్టులు రాయగల్గి ఉన్నప్పుడు దాని జోలికెందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటా! కానీ ఒక్కోసారి అలా వృత్తి ధర్మంగా రాయాల్సి వస్తుంది.
నా బ్లాగులో వంటలుండవు! "ఎప్పుడూ వంటేనా"అని బాధ పడే టపా ఒకట్రాశాను!
అంతమాత్రం చేత వంటలు రాసే బ్లాగుల పట్ల నాకేం వ్యతిరేకత లేదు. లోకో భిన్న రుచిః!
పైగా రిఫర్ చేస్తుంటా కూడా!
'ఆడ' అంటే 'వంటిల్లు' అనే అర్థం యెక్కడైనా వుందేమోనని! ....
ఈ డౌష్టు నాక్కూడా ఉంది!
డియర్ సుజాత!
వృత్తిధర్మం గా వ్రాసిన మిమ్మల్నేమీ అనలేదు కదమ్మా!
నిన్న మీరు వ్రాసిన దేవుడి నగల గురించిన టపా చదివి, మీరు మంచి జర్నలిస్ట్ అనుకున్నాను.
చాలా కాలానికి వ్యాఖ్య వ్రాసినందుకు సంతోషం.
ధన్యవాదాలు.
Post a Comment