ఆశీర్వాదాలు!
84 యేళ్ళ ఒకాయన--ప్రభుత్వం లో మంచి వుద్యోగం చేసి, పదవీ విరమణచేసి, 24 యేళ్ళు అయ్యింది.
ఆయన సుమారు యెత్తుగా (పొట్టిగానే) వుంటారు. సాక్స్ లేకుండ రెయిన్ బూట్లు, పొడుగు లాగు, దానిమీద పంచెకట్టు, అఫీషియల్ లాల్చీలాంటి చొక్కా (కఫ్ లింక్స్ తో), మెడచుట్టూ కండువా (ఒకే రంగు అంచు--అత్తా కోడళ్ళంచు కాదు), నుదుట విభూతి పుండ్రాలు, మధ్యలో కుంకం బొట్టు (గంధం బొట్టుమీద కాదుస్మీ!), చేతిలో ఒక ప్లాస్టిక్ బస్తాలాంటి, పర్సులాంటి ఫోల్డరూ, బ్రాహ్మణ తేజస్సు వుట్టిపడుతూ--వస్తారు మా బ్యాంకుకి.
ఓ 35 యేళ్ళ క్రితం మా బ్యాంకు బ్రాంచి ప్రారంభించినప్పుడు, మొట్టమొదటి ఖాతాదారుగా, సేవింగ్స్ బ్యాంకు ఎక్కౌంట్ నంబరు '1' ఆయనదే!
ఆయనకి ఆ గౌరవం యెప్పుడూ ఇస్తూవుంటుంది మా బ్యాంక్; బ్రాంచీ! ఖాతాదారుల సమావేశామైనా, కొత్త 'ప్రొడక్ట్ లాంచింగ్' అయినా, యేదైనా ప్రారంభించాలన్నా, ఆయన చేతుల మీదుగానే!
ఆయన ఈ బ్రాంచిలో ఖాతా పెట్టిన ఆరునెల్లకి, నేను కేషియర్ గా ఈ బ్రాంచికి వచ్చాను. నా వయస్సు 23 యేళ్ళు. ఆయన వయస్సు 49 యేళ్ళు!
ఆయన బ్యాంకుకి రాగానే, అందరికీ చేతులుజోడించి, 'నమస్కారం' అంటూ వచ్చేవారు! మేనేజరుతోసహా అందరూ ప్రతి నమస్కారం చేసేవారు--చేతులు జోడించి.
నేను మాత్రం, ఆయన నా ముందు చేతులు జోడించగానే, 'పెద్దవారు! నాకు చేతులు జోడించితే నాకు ఆయుక్షీణం!' అంటూ ఆయన చేతుల్ని విడదీసి, కాళ్ళకి నమస్కరించేవాడిని--ఆయన--'అయ్యో!' అంటూండగా.
ఇప్పుడు ఆయన వయస్సు--చెప్పానుగా--84 యేళ్ళు! నా వయసు--58 యేళ్ళు! ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి--ఆయన రెటైర్ అయిపోయినా, మా బ్రాంచికి ముఖ్యమైన 'కస్టమర్ '! నేను ఈ బ్రాంచిలో వుద్యోగిని!
ఆయన అన్నీ ఆలోచించుకొని, ఇంటిలో ప్రాక్టిసు చేసుకొని మరీ వస్తారు మా బ్రాంచికి!
జ్యోతిబాసు లెవల్లో, మా పేటకే పెద్దాయన ఆయన!
లోపలికి రాగానే, ముందు నేనే వుంటాను--నా సీటులో! ఆయన చేతులుజోడించి, 'నమస్కారం' అంటే, నాది స్టాండర్డ్ డైలాగు!
అందుకని, ఆయన ప్రవేశిస్తూనే, "ఆశీర్వచనాలు! ఆశీర్వచనాలు!" అంటూ వస్తారు--కానీ, ఆయన చేతులు జోడించే వుంటాయి మరి!
ఈ 'ప్రెడికమెంట్' గురించి మీరేమంటారు?
2 comments:
:)
డియర్ రాజేంద్ర కుమార్ దేవరపల్లి!
చాలా సంతోషం!
ధన్యవాదాలు!
ఇన్నాళ్ళూ 'అదేదో సింహం' అడ్డం పడి, మీకు జవాబు ఇవ్వలేదు!
తన భావప్రకటన స్వేచ్చని వుపయోగించుకుంటున్న అప్పారావు శాస్త్రి మీద ఈ సింహాలకి ఇంత అక్కసెందుకో?
ఆ అక్కసు నా బ్లాగులో వెళ్ళగక్కడం యెందుకో?
యేమిటో? యెందుకో?
Post a Comment