బంగ్లా బృందం ప్రశంస!స్వడబ్బా, పరడబ్బా, పరస్పరడబ్బా—ల గురించి వినే వుంటారు—తన గురించి తను వాయించుకునే డబ్బా—స్వడబ్బా; ఇతరుల గురించి వాయించే డబ్బా—పర డబ్బా; ఒకరినిగురించి ఇంకొకరు వాయించుకునే డబ్బా—పరస్పర డబ్బా! బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనిస్ అనే ఆయన, మహిళా సంఘాలకి, ఇతర సంఘాలకీ, ‘మైక్రో ఫైనాన్సింగ్’ పేర తక్కువ వడ్డీ ఋణాలని అందించే ప్రయోగాలు చేసి, యేకంగా నోబెల్ ప్రైజు కొట్టేశాడు! అప్పుడు మనదేశం వాళ్ళు వెళ్ళి, ఆ విధానాలని అధ్యయనం చేసి వచ్చి, వాడికి డబ్బా కొట్టారు! ఇప్పుడు వారి వంతు! వారు వచ్చి, వట్టి వసంత్ కుమార్ ని కలిసి, గ్రామ సంఘాలూ, మండల సమాఖ్యలూ, స్వయం సహాయ సంఘాలూ చాల చక్కగా పావలా వడ్డీ ని ఉపయోగించుకుంటున్నాయి—అని ప్రశంసల జల్లు అనే డబ్బా కొట్టేశారట! ఈ పరస్పర డబ్బ యెంత బాగుందో కదూ!
Sunday, June 7, 2009
పావలా వడ్డీకి…..
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఇచ్చి పుచ్చుకోవటమంటే అదే.ఈ విధానం సన్మానాలలోను, సంగీత కచ్చేరీలు పెట్టడంలోనూ ఉంది. అది ఉభయులకు లాభదాయకం కదా!
డియర్ పద్మనాభం దూర్వాసుల (గారూ)!
సన్మానాలూ, సంగీత కచేరీలూ వరకైతే ఫరవాలేదు! మీరన్నట్టు ఉభయతారకం!
కానీ నాబాధ--కోట్లాది మందితో ఆడుకోవడానికి ఈ డబ్బాలేమిటీ అని!
Post a Comment