Monday, February 17, 2014

సరదా సాహిత్యం


భాష--యాస

మన భాషల్లో,  యాసల్లో, పదాల్లో చాలా తమాషాలుంటాయి.

"రే రేవడ్సడ్సా?"

అని ఒకడడిగితే, రెండోవాడి సమాధానం:

"లే ఇస్కిస్కిస్కే!" (ఇదే భాష? అని సందేహం వస్తుంది)

ఇంతకీ మొదట పడవలోని సరంగు అడిగింది "అరే! రేవు అడుసు అడుసుగా వుందా?" అని.

ఒడ్డునున్నతను జవాబిచ్చింది "లేదు! ఇసక ఇసకగానే వుంది" అని.

(ఆ మధ్య తెలుగు వెలుగు పత్రికలో వేరెవరో వ్రాసిందే ఇది)

మా వూళ్లో ఓ బ్రిటిష్ దొరగారు ఒకసారి ఒకతన్ని పిలవవలసి వచ్చి......

"కోక్ కీర్ గాడ్ వేన్ మే యా!" అని పిలిచాడట, పేరు ఇంగ్లీషులో వ్రాసి వున్నా. (VAN MAY YA అని)

ఇంతకీ అతని పేరు "కొక్కిరిగడ్డ వనమయ్య"!

ఓ పాతిక ముఫ్ఫై యేళ్లక్రితం ఓ పత్రికలో వచ్చిన కార్టూన్లో, ఓ ఆర్టిస్ట్ బోర్డులు వ్రాస్తూంటాడు.

"టాక్లెస్వర్క్మోర్", "ఇక్కడ్చాపల్పట్రాదు"...............లాంటి బోర్డులు వ్రాసి పెట్టివుంటాడు. అతని షాపు పేరు "పిస్నారార్ట్స్"!

అర్థమయ్యాయనుకుంటా?

"టూటు టూటు టూటూ......."

దీన్ని ఓ కమల్ హాసన్ సినిమాలో వాడుకున్నారు. దీనర్థం?

ఇది "ఆమదాలవలస" లో "కోణార్క్ ఎక్స్ ప్రెస్" సమయం! 2 to 2-00 TO 2-02 అని!
(రెండు నిమిషాల తక్కువ రెండుగంటలకి వచ్చి, రెండుగంటల రెండు నిమిషాలకి వెళ్లిపోతుందని).

ఒక మోహన్ సింగ్ గారు, మనదేశానికి మొదటిసారి "బోయింగ్" విమానం వస్తూందంటే, చూడడానికి వెళ్ళాడట. తీరా అది లేండ్ అయ్యే సమయానికి సంతోషం పట్టలేక "బోయింగ్ ఈజ్ కమింగ్! బోయింగ్ ఈజ్ కమింగ్!" అని అరవడం మొదలుపెట్టాడట. ప్రక్కనున్నాయన, "అరే యార్! బీ సైలెంట్!" అన్నాడట. మన సింగ్ గారు అతనితో, "ఓ! థాంక్యూ!" అని చెప్పి, "ఓయింగ్ ఈజ్ కమింగ్, ఓయింగ్ ఈజ్ కమింగ్!" అని అరవడం మొదలెట్టాడట!

ఇదో సరదా ఇంగ్లీషు జోకు.

ఓ దేశంలో, వాళ్ల భాషలో, "మూడు వందల ముఫ్ఫై మూడు" అనమన్నామంటే, వెంటనే లెంపకాయ కొట్టేస్తారట! యెందుకంటే, "మూడు" అనడానికి వాళ్లు "పొయెటర్రా రోరింకో రోక్" అనాలట! మరి "ముఫ్ఫై మూడు కోట్ల, ముఫ్ఫైమూడు లక్షల........" ఇలా పూర్తిగా అనమంటే యేం చేస్తారో?

(ఇది నేను చిన్నప్పుడు యెప్పుడో ఓ పత్రికలో చదివింది)

ఇలాంటివి ఇంకెన్నో!

4 comments:

కంది శంకరయ్య said...

చదివి ఆనందించాను. ఇందులో ‘ఇస్కిస్కెస్కే’ తప్ప మిగతావి నాకు క్రొత్తవే. ధన్యవాదాలు.

Anonymous said...

:)

A K Sastry said...

డియర్ కంది శంకరయ్య గారూ!

బహుశా తెలుగు వెలుగులో అది వ్రాసింది మీరేనా అని నా సందేహం. మీ సమస్యా/పూరణాలూ చదువుతూనే వుంటాను. మీ దృష్టి నా చిన్ని బ్లాగు మీద పడడం నా అదృష్టం!

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ puranapandaphani!

సంతోషం.

ధన్యవాదాలు.