Saturday, October 8, 2011

ఇలాంటివాళ్లని చూశారా?



......నేను చూశాను మరి!   

లండాచోరీ--పితలాటకం--లిటికిలేషన్--యెడ్డెం అంటే తెడ్డెం--ఇలా కొన్ని మాటలున్నాయి మనతెలుగులో. కొన్ని అచ్చతెలుగు పదాలూ, కొన్ని పరభాషా స్వీకర్తాలూ!

వీటివెనుక కొన్ని "తర్క, మీమాంసా" వగైరా శాస్త్రాలున్నాయి(ట).

ఒకాయన బజార్లో నిమ్మకాయలు కొనడానికొచ్చి, అడిగాడు "యెలా ఇస్తున్నావు?" అని. 

వాడు రసికుడు--"చేత్తోనే" అన్నాడు. 

"ఆహా! అలాగా? అయితే ఒక్కోటీ యెంతకిస్తావు?" 

"ఒక్కోటీ ఓ రూపాయికిస్తానండి!" 

"బాగుంది. పళ్లు బాగున్నాయి. నువ్వు ఒక్కోటీ పాతిక రూపాయలన్నా కొనుక్కోవలసిందేకదా? అవసరం నాది మరి! సరే....ఓ పది ఇవ్వు" అంటూ పదిరూపాయల నోటిచ్చాడు. 

వాడు ఓ పది నిమ్మకాయలని (పళ్లని) ఓ సంచీలో వేసి ఇచ్చాడు. 

తీసుకొని వెళ్లిపోవచ్చుకదా? వూహూఁ! 

(బుట్టలో ఇంకా ఓ అరవై డెభ్భయి నిమ్మపళ్లున్నాయి.) 

"ఇప్పుడు చెప్పు. ఈ యెండలో ఆ బుట్టలో పళ్లన్నీ ఒక్కోటీ రూపాయకి సాయంత్రందాకా అమ్ముకుంటావా? లేక, యేదో రేటుకి మొత్తం నాకిస్తావా? ఇస్తే యెంతకిస్తావు?" 

"మారాజులడగాలేగానండీ, ఓ యాభై రూపాయలకిస్తానండి!" 

"పదిహేనిస్తాను" 

"ఖుదరదండి" 

"సరే! ఇరవై?" 

"రావండి" 

"ఫైనల్గా చెపుతున్నాను. ఇరవై రెండు.....నీ యిష్టం!" 

"ఇవ్వలేనండి.....సరే, మారాజులు ఓ పాతికిప్పించండి!" 

పావుగంటలోపలే బేరం ఫైసల్! ఆయన పాతికా ఇచ్చి, బుట్టెడు కాయలూ తీసుకొన్నాడు. 

"రండిబాబూ! రండి! నిమ్మపళ్లు కావాలా? వూరికే ఇస్తున్నాను! తీసుకోండి!" అంటూ, పావుగంటలో వెళ్లేవాళ్లకీ, వచ్చేవాళ్లకీ పంచిపెట్టేసి, కారెక్కి, వెళ్లిపోయాడు!

ఈ లండాచోరీ యేమిటీ? ఇందులో యెవరి బలం యెంత? యెవరి బలహీనత యేమిటి? ఇలాంటివే "తర్క, మీమాంసా"వగైరా శాస్త్రాలు!

(ఆ బుట్టగలవాడు రైతు కాదు! ఓ వందకాయలు పాతిక రూపాయలకి రైతుదగ్గరకొన్న 'దళారి!')

 యెవరి వ్యాపారం వారిదికదా!?

(తెలివి ఒక్కడి సొమ్ముకాదోయ్!)


2 comments:

హరి said...

ఎంటీయార్ నుండి కిరణ్‌కుమార్రెడ్డిదాకా ఎందరని చెప్పేది?

A K Sastry said...

డియర్ హరిగారూ!

సంతోషం.

మీరు ఎంటీయార్ అనగానే, ఆంధ్రభూమివీక్లీలో "అచె"లో యెవరో "ఎన్ టీ ఆర్?" అనడిగితే, జవాబు "ఎమ్‌టీ! యార్!" అని చదివినది గుర్తొచ్చింది.

మరి నా ప్రశ్నలమాటేమిటి?

జూన్ తరవాత మీరు టపాలెందుకు వ్రాయడం లేదు?

ధన్యవాదాలు.