Thursday, December 9, 2010

సరదాలూ.....

......యెద్దేవాలూ

........వేళాకోళాలూ, వెక్కిరింతలూ, కొక్కిరింతలూ, కు.కా.చె.దె లూ, చతుర్లూ, వ్యంగ్యాలూ.....ఇవన్నీ తెలుగు సాహిత్యంలోనూ, మన సంస్కృతిలో భాగాలే! అవునంటారా?

"మీ రుమాలా" అంటే, "అవును--మాదిగా" నుంచి, "మీవూళ్లో గాడిదలెక్కువ సుమండీ" అంటే, "వున్నవిచాలక ప్రక్కవూళ్లనించి కూడా వచ్చేస్తున్నాయిస్మండీ" వరకూ కోకొల్లలు!

12 డిసెంబరు (మానాన్నగారి జయంతి)--బ్లాగర్ల దినం--సారీ, దినోత్సవంట! అందరికీ శుభాకాంక్షలు!

ఇదేమిటి--(బ్లాగుల్లో) దినాల వుత్సవాల సందర్భంగా శుభాకాంక్షల్ని విశ్వనాధవారిచేత యెద్దేవా చేయించిన వీడేమిటీ.....ఇప్పుడు శుభాకాంక్షలంటాడూ.....అంటారా! ఇదీ యెద్దేవాయేనండోయ్!

నా బాధల్లా, టపాలు పూర్తిగా చదివో, చదవకుండానో, ఓ పాయింటు పట్టుకొని కామెంట్లు పెట్టేస్తున్నారు చాలా మంది. బాగుంది. సరే!

కొన్ని విషయాలనీ, వ్యక్తులనీ యెంత ఘాటుగా విమర్శించినా, చదువరులు (చదువరి పేరుతో బ్లాగులు వ్రాసేవారు కాదండోయ్!) యెందుకో వాళ్ల వాళ్ల 'కామెంటుచేసే' రైట్ ని 'రిజర్వ్' చేసేసుకొని, వ్యాఖ్యానించడంలేదు!

దీనిక్కారణం......? (భయమా, సంకోచమా, బిడియమా.....ఇలా ప్రశ్నిస్తే మళ్లీ విరుచుకు పడతారేమో!)

అయినా, నా నోరాగదు! నోరా వీపుకు తేకే అన్నట్టు! యేంచేస్తాం! యెప్పుడూ చెఱువుమీద కోపమే నాకు!

మరోసారి 'శుభాకాంక్షలు!'

బ్లాగండి, బ్లాగించండి, బ్లాగులనే శ్వాసించండి! (యెలా వుంది?)

5 comments:

మిస్సన్న said...

మీరన్నారని కాదు గానీ ఈ ఉత్సవాలన బడే 'దినాల' సంస్కృతి కొంత కాలం క్రితం వరకూ విదేశాల్లోనే వర్ధిల్లేది. ముఖ్యంగా వ్యక్తుల పేరిట దినాలు. అంటే తల్లి దినం, తండ్రి దినం, ప్రేమికుల దినం (mothers డే fathers డే lovers డే) వగైరాలు. నేను తప్పు గాక పోతే మొదట ఉపాధ్యాయుల దినం తో ఆరంభం అయిందేమో ఈ వ్యక్తిగత దినాల పండగలు. నా చిన్నప్పుడు ఉపాధ్యాయుల దినం, బాలల దినం మాత్రమే ఉండేవనుకొంటా. ఆ రోజు మట్టుకు ఆ వ్యక్తీ లేదా వ్యక్తులను ఆకాశాని కెత్తేస్తే చాలు. ఇక మరిచి పోవచ్చు ఏడాది దాక. ప్రస్తుతం ఈ జాడ్యం మనకి పుష్కలంగ అంటుకొంది. ఈ దినాల పుణ్యమా అని వ్యాపారస్తులు బాగా బాగుపడుతున్నారు. వాణిజ్య ప్రకటనల రూపేణాను, అమ్మకాల రూపేణానూ. అంతా పడమటి గాలి మహత్తు. ఏం చేస్తాం మనం నిమిత్త మాత్రులం.

A K Sastry said...

డియర్ మిస్సన్న!

హమ్మయ్య! ఇన్నాళ్లుగా నేను వేస్తున్న (నా ఇతర బ్లాగులు కూడా......) అనే వలలో పడే ధైర్యం మీరొక్కరే చేశారు! సంతోషం. (అప్పటికీ, కొన్ని 'రిజర్వ్' చేసుకొన్నారు!)

ఇక విషయానికొస్తే, మీరు చెప్పిన 'వుపాధ్యాయుల...' మొదలైనవాటికన్నా, మే దినం (కార్మికుల....) బాగా పాతది అనుకుంటా.

ఐక్యరాజ్య సమితి 'నిబధ్ధంగా' జరుపుకోమని చెపుతున్న సంవత్సరాలూ, దినాలూ కాకుండా, వ్యాపారులు పోషిస్తున్న దినాలు యెక్కువ అయిపోతున్నాయి.

ఇక ప్రాచీన (మత/ధర్మాథారిత) దినాలు యెలాగూ వున్నాయి (క్షీరాబ్ది ద్వాదశి, గుడ్ ఫ్రై డే, మహమ్మదు జన్మదినం లాంటివి!--వీటినికూడా "శాస్త్రులూ" "పరిసయ్యులూ" మొ.వారు ఇంకా పెంచుకొంటూ పోతున్నారు. చూ. ఈనాడులో 'అంతర్యామి ' అనే కాలమ్!)

రాబోయే రోజుల్లో, ప్రతీ సంవత్సరమూ, ప్రతీ దినమూ యేదో ప్రత్యేకతని సంతరించుకుంటుందని నా వుద్దేశ్యం.

ఇలాగే, నా మిగతా బ్లాగులుకూడా.......!

ధన్యవాదాలు!

tankman said...

@మిస్సన్న గారు....సంక్రాంతి అనేది రైతుల పండగ మాష్టారు..అల అని సిటీ లో ఉండేవాళ్ళు సంక్రాంతిని జరుపుకోడం మానేసార? సంక్రాత్రి పేరుతొ గాలిపటాలు తాయారు చేసే వాళ్ళు, ముగ్గు అమ్మేవాళ్ళు బాగు పడుతున్నారు అని మనేసామా? పండగ చేసుకోడానికి ఏ ఒక్క కారణం దొరికినా చాలు మనకి...SMSలు, E-mail's forward చేసుకోడానికి ..ఏది అయితేనేం? పడమట గాలో తూర్పు గాలో ..హాయిగా ఉంటే చాలు..ఎటు వైపు నుంచి వచ్చింది అనవసరం...

A K Sastry said...

డియర్ sanju - The king!!!

యెవరి వ్యాపారాలు వాళ్లవి అన్నది అందుకే! యెవరి సరదాని యెవరు కాదంటారు? మీరన్నట్టు అందరూ 'హాయిగా' వుంటే చాలు.

బై ది వే, మీ బ్లాగులో టపాలు చాలా బాగున్నాయి.

కొనసాగించండి.

tankman said...

thankyou krishnasri garu :)