పప్పులుడుకుతున్నాయి(కాకినాడలో, రెండిళ్ళమధ్య వున్న ప్రహరీగోడకిరుప్రక్కలా వున్న మహిళల సంభాషణ)—
‘పనైపోయిందా వదినా? యేమి వండావు?’
‘అయినట్టేనమ్మ! చారు మరుగుతోంది—కరేపాకు రెబ్బలకోసం దొడ్లోకి వచ్చాను!’
‘చాలానే వండినట్టున్నావే? ఇవాళ ఆదివారమొకటి కదా!’
‘అదే వండడం వొదినా—మీ అన్నయ్య సంగతి తెలుసుగా—వారం రోజులూ గాలితో బ్రతికినట్లు—ఆదివారం వారం రోజుల భోజనం ఒకేసారి చేస్తారు!
అందుకనే—ఓ పదహారు కందిపప్పులు జాగ్రత్తగా దాచి, ఇవాళ పదికట్టల గోంగూరలో వేసి పప్పు చేశాను! మొన్న రేటు తక్కువున్నప్పుడు ఓ వందగ్రాములు దొండకాయలు తీసుకున్నాలే—వాటిని కాస్త బెల్లం పెట్టి కూర చేశాను! పోపుల పెట్టెలో ఓ నలభై రెండు శనగపప్పులుంటే, కాస్త కారం, చింతపండూ వేసి, పచ్చడి చేశాను—నాలిక్కి రాసుకోడానికి! ఊరగాయలు యెలాగా వున్నాయి—ఇక చారు, మజ్జిగ—మామూలే! ఇంతకీ నువ్వేమి వండావు?’
‘నేనా వదినా—నీలా ముందుచూపు లేకపోయింది నాకు—కాసిని కంది బద్దలూ, శనగబద్దలూ నిలవెయ్యలేకపోయాను! అయినా, మా దొడ్లో తోటకూర వుందిగా, దాన్ని జీడిపప్పులో వేశాను! కూరకి, ఆనపకాయ ముక్క, నువ్వుపప్పులో వేశాను! పచ్చడికి వేరుశనగ వాడాను! పులుసులోకి, బాదం పప్పు వేశాను! నువ్వన్నట్టు వూరగాయలు వున్నాయి—మజ్జిగ మామూలే!’
‘ఇవన్నీ యెప్పుడు నేర్చావొదినా? నాకు తెలియలేదే?’
‘పిచ్చిదానా! యెప్పుడైనా వంటచెయ్యడానికి బధ్ధకం వేసినప్పుడు మన సుబ్బయ్య హోటల్ నించి ఓ బుట్ట తెప్పించుకుంటాం కదా? వాడు అన్నిట్లోనూ జీడిపప్పులూ, బాదం పప్పులూ, నువ్వుపప్పులూ వేసేస్తున్నాడు అని విసుక్కొని, ఇక తెప్పించడం కూడా మానుకున్నాం కొన్నాళ్ళనించీ—ఇప్పుడవే అక్కరకొస్తున్నాయి మరి!’
(యెలక్షన్లకి ముందు వున్న రేట్లతో పోలిస్తే, కంది, శనగ, పెసర, మినప్పప్పూ, చింతపండూ విపరీతం గా పెరిగాయిగానీ, జీడి పప్పూ, బాదం పప్పూ, నువ్వు పప్పూ, వేరుశనగ పప్పూ పెద్దగా పెరగలేదు—అందుకని అందరూ ఇవే వండుకుంటే పోతుందిగదా—వెరైటీగానూ వుంటుంది, ఖరీదైన భోజనం చేసినట్టూ వుంటుంది!)
(పప్పులలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరుగుతోంది—నూనె గింజల్లో బ్యాన్ కొనసాగుతోంది!)
12 comments:
కాకినాడలో, ఆ రెండిళ్లలో ఒకిల్లు మాది. :-)
బొల్లోజు బాబా
Ha...:) :)
సుబ్బయ్య హోటల్ బుట్ట గుర్తు చెసారా :-).. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సుబ్బయ్య హోటల్ లొ కుమ్మెసెవాడిని. అక్కడి టేస్ట్ ఫైవ్ స్టార్ హొటల్ ఫుడ్ కి కూడా రాదు.
ది బెస్ట్ ఫుడ్ అండ్ ది బెస్ట్ సర్విస్
:))
:)) బాగుంది.
బాబా గారూ మా చెల్లెమ్మనడిగి ఓ నాలుగు జీడి పప్పులు పంపుదురూ.. సాయంత్రం మాఇంట్లో శ్రావణ మంగళవారం భక్తులకి జీడిపప్పు పాకం చేద్దాం అనుకుంటున్నాం !! :-)))))))))))))
:D
డియర్ బొల్లోజు బాబా!
చాలా సంతోషం!
ఇంతకీ పప్పులు నిలవేసినదా—జీడిపప్పులు వండుకున్నదా? యేది మీ యిల్లు?
ధన్యవాదాలు!
డియర్ ఆత్రేయ కొండూరు!
అయితే బాబాగారి పక్కిల్లు తమదే అన్నమాట! ఇప్పుడు క్లారిఫై అయిపోయింది!
ధన్యవాదాలు!
డియర్ ...padmarpita...! మంచుపల్లకీ! మధురవాణి! శరత్ ‘కాలం’! లక్ష్మి!
మీ సంతోషమే నాకానందం!
ధన్యవాదాలు!
:-)
manchi salahaane .haayigaa ikanunchi jeedipappula to vandukunte sari.
డియర్ మాలా కుమార్!
.....కదా? .....సరి కదా!
ధన్యవాదాలు!
Post a Comment